పవన్ క్రిష్ సినిమా కోసం ఆ ఇద్దరూ ఫైనల్ ..Jacqueline
2020-02-19 17:14:54

ఇక సినిమాలే లేవనుకున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలు ఒప్పుకుని షాకిచ్చారు. మూడు సినిమాల్లో క్రిష్ తో కూడా ఒక సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా అయిపోయింది. ఓ పక్క షూటింగ్ ఫాస్ట్‌గా జరిగిపోతున్నా హీరోయిన్ గురించి మాత్రం క్లారిటీ రాలేదు. 

ఈ సినిమాలో కధ ప్రకారం ముగ్గురు హీరోయిన్స్ ఉంటారట. దీంతో ఇప్పుడు ఆ ముగ్గురిని సెట్ చేయడం పెద్ద పనయిపోయింది క్రిష్ కి. ఒక హీరోయిన్ రోల్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌ను పెట్టాలని క్రిష్ భావిస్తున్నారట. సినిమా ప్యాన్ ఇండియా అనుకుంటున్నారు కాబట్టి అక్కడి హీరోయిన్ అయితే కొంత మార్కెట్ పెంచుకోవచ్చనేది ఆయన ప్లాన్. అయితే సినిమా కోసం ముందు సోనాక్షి సిన్హాను అనుకున్నారట. కానీ ఆమె ఒప్పుకోక పోవడంతో వాణీ కపూర్, దిశా పటానీ పేర్లు కూడా లైన్ లోకి వచ్చాయి. 

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటి జాక్విలిన్‌ ఫెర్నాండజ్‌ నటించనుందట. జాక్విలిన్‌ మొన్న ప్రభాస్‌ నటించిన సాహో చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది, ఇప్పుడు ఆమె పవన్ సినిమా ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఫెర్నాండజ్‌ రెమ్యునరేషన్ కూడా సుమారు ఐదు కోట్ల దాకా బాడుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా భూమిక ఎంపికయిందని కూడా ప్రచారం జరుగుతోంది. 

More Related Stories