వకీల్ సాబ్ లో పవన్ జనసేన డైలాగులు



 vakeel saab
2021-04-09 15:13:12

దాదాపు మూడేళ్ల త‌ర‌వాత ప‌వ‌న్ రీఎంట్రీ ఇచ్చిన సినిమా వ‌కీల్ సాబ్.  ఓ మై ఫ్రెండ్, ఏంసీఏ సినిమాల ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెర‌‌కెక్కించాడు. పింక్ సినిమాకు రీమేక్ గా వేణు శ్రీరామ్ వ‌కీల్ సాబ్ ను తెర‌కెక్కించారు. తెలుగు రీమేక్ లో ప‌వ‌న్ ఇమేజ్ కు త‌గిన‌ట్టుగా సినిమాలో ఫైట్ సీన్లను జోడించారు. ఇక సినిమానుండి విడుద‌లైన పాటలు, టీజ‌ర్ , ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించాయి. దాంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈరోజు విడుదలైన సినిమాకు కూడా సూపర్ హిట్ టాక్ వస్తోంది. 

ఇక పవన్ ప్రస్తుతం సినిమాల్లోనే కాకుండా జనసేన పార్టీ తో రాజకీయలతోనూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా సినిమాలో పవన్ జనసేన ఉద్దేశ్యాలను జనాల్లోకి తీసుకువెళ్లేలా డైలాగులు పేల్చారు. న్యాయవ్యవస్థ లోని లోపాలు లొసుగులను ఎత్తి చూపారు. "నేను గెలుపు కోసం పోరాడను..ధర్మం కోసం పొర్రాడుతాను" అంటూ సినిమాలో పవన్ డైలాగ్ చెప్పారు. అయితే ఇదివరకు పలు సార్లు సమావేశంలో పవన్ జనసేన ధర్మం కోసం పనిచేస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా "నేను మీ కష్టాలు నాకు తెలుసు..నేనెప్పుడూ మీ వెంటే ఉంటాను " అనే డైలాగ్ కూడా బాగా పేలింది. జనం కోసం జనసేన...మీ వెంటే నేను అని పవన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇక ఇలాటి డైలాగులు థియేటర్ లో పేలడం తో జనసైనికుల్లో నూతనోత్సాహం నింపారు.
 

More Related Stories