జనసేనలో విషాదం.. పవన్  అనుచరుడు కన్నుమూత..Venkata Bhaskar Rao died
2020-02-22 17:38:58

జనసేన పార్టీలో కీలక నేత కన్నుమూసాడు. పవన్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలు కూడా చేస్తున్నాడు. మొన్నటి వరకు ఐదు రోజుల పాటు పాలిటిక్స్ చేసిన ఈయన ఇప్పుడు సినిమాలకు టైమ్ కేటాయించాడు. అయితే అంతలోనే ఈయనకు పెద్ద దెబ్బ తగిలింది. జనసేన పార్టీలో నూజివీడు నుంచి చాలా కీలకంగా ఉన్న ఓ నేత అనారోగ్యంతో కన్నుమూసాడు. నూజివీడు మున్సిపల్ మాజీ ఛైర్మన్ బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు అనారోగ్యంతో మరణించాడు. 

కొన్ని రోజులుగా ఈయన అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 22న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భాస్కరరావు మృతి వార్త తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నాడు పవర్ స్టార్. నూజివీడులో పార్టీ బలోపేతం కావడానికి చాలా కృషి చేసారని.. అదంతా జనసైనికులు ఎప్పటికీ మరిచిపోలేరని చెప్పాడు పవన్. అలాగే నూజివీడు ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివి అంటూ కొనియాడాడు జనసేనాని. 

ఆయనతో పాటు పలువురు జనసేన నేతలు కూడా భాస్కరరావుకు సంతాపం వ్యక్తం చేసారు. ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ కన్నీరు పెట్టుకున్నాడు పవన్. తన తరఫున, తన పార్టీ తరఫున భాస్కరరావుకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపాడు పవన్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పాడు పవర్ స్టార్.

More Related Stories