దేవరకొండకి హ్యండిచ్చిన జాన్వీ Janhvi Kapoor
2020-01-03 11:35:19

హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో  ఫైటర్ అనే సినిమా మొదలు కాబోతోంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుండగా ఈ సినిమా ద్వారా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయిక గా టాలీవుడ్ కు పరిచయం అవబోతోందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సహ నిర్మాత గా జాయిన్ కావడంతో, ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారని అన్నారు. జాన్వీ సినిమాల బాద్యతలు కరణ్ చూసుకుంటున్నారు కాబట్టి ఆమె ఈ సినిమాలో నటించడం దాదాపు ఖాయమనే అనుకున్నారు.  అయితే బీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఫైట‌ర్ సినిమా నుండి జాన్వీ త‌ప్పుకున్న‌ట్టు చేబుతున్నరు. ఆమెకున్న బిజీ షెడ్యూల్ వ‌ల‌న ఫైట‌ర్‌ సినిమాకి డేట్స్ కేటాయించ‌లేక‌పోతుంద‌ని అందుకే ఈ సినిమా నుండి తప్పుకుంటుందని అంటున్నారు. దీంతో ఫైట‌ర్ సినిమాలో క‌థానాయిక‌గా కొత్త అమ్మాయిని తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట పూరి అండ్ టీం. తన సినిమాల ద్వారా ఎంతో మంది అమ్మాయిలను పరిచయం చేసిన పూరీ ఈ సినిమాకు ఎవరిని పరిచయం చేస్తాడో చూడాలి.  

More Related Stories