మళయాళ రీమేక్ లో శ్రీదేవి తనయ Janhvi Kapoor
2020-08-03 19:01:30

అన్ని బాషలలో ప్రస్తుతం రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ సినిమాలన్నీ దాదాపు హిట్ లు కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో హిట్ లేని వారు అంతా అదే బాట పడుతున్నారు. మరీ ముఖ్యంగా మిగతా ఇండస్ట్రీల వాళ్ళు మళయాళ సినిమాల మీద మనసు పడ్డారు. ఇప్పటికే ఈ ఇండస్ట్రీకి సంబంధించిన సూపర్ హిట్ సినిమాలని తెలుగు వాళ్ళు గట్టిగానే కొన్నారు. మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే సినిమాను రీమేక్ చేయడం కోసం సితార ఎంటర్టైన్మెంట్ కోసం నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. వీళ్ళే మరో సినిమా అయిన కప్పేలాని కూడా కొన్నారు. మరోపక్క చిరంజీవి హీరోగా లూసిఫర్ రీమేక్ తెరకెక్కుతోంది. 

తాజాగా మలయాళ చిత్రం ‘హెలెన్‌' ని కూడా హిందీలో రీమేక్‌ చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ  రీమేక్‌లో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించనున్నదని చెబుతున్నారు. ఓ అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి జాన్వీ కపూర్‌ తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని ప్రచారం జరుగుతోంది. దర్శకుడితో పాటు ఇతర నటీనటుల కోసం యూనిట్ సెర్చ్ లో ఉన్నట్టు చెబుతున్నారు. అనుకోకుండా ఓ కోల్డ్‌ స్టోరేజ్‌లో చిక్కుకున్న ఓ యువతి రాత్రంతా ప్రాణాలను దక్కించుకోవడానికి సాగించిన పోరాటమే ఈ సినిమా. మలయాళంలో అన్నా బెన్ నటించి ఈ పాత్రకు మంచి ప్రసంశలు అందుకుంది.  

More Related Stories