కరోనాతో ప్రముఖ కమెడియన్ కన్నుమూత..comedian Shimura
2020-03-30 21:36:21

ఒక్కొక్కరుగా కరోనాతో పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. కరుణ లేని కరోనా అందర్నీ కాటేస్తుంది. ఇప్పటికే ఈ వ్యాధితో చాలా మంది ప్రముఖులు కూడా బాధ పడుతున్నారు. అందులో దేశ ప్రధానులు కూడా ఉన్నారు. బ్రిటీస్ రాణి సైతం కరోనాతో చనిపోయింది. హాలీవుడ్ నటులు కూడా ఇప్పటికే కొందరు చనిపోయారు. ఇప్పుడు మరో ప్రముఖుడు కూడా చనిపోయాడు. కరోనా సోకి ప్రముఖ సింగర్ జో డిఫీ చనిపోయిన కాసేపటికే మరో మరణం కూడా సంభవించింది. తాజాగా జపనీస్ కమెడీయన్ కెన్‌ షిమురాని కూడా కరోనా కాటేసింది. ఈయన వయసు 70 ఏళ్లు. కరోనా వైరస్ సోకడంతో కొన్నాళ్లుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈయన. అయితే పరిస్థితి విషమించడంతో మార్చ్ 29న ఈయన కన్నుమూశారు.

కరోనాతో మృతి చెందిన తొలి జపాన్ సెలబ్రిటీ కెన్‌ షిమురానే. 1970-80 కాలంలో ఆయన కమెడియన్‌గా ప్రేక్షకులని ఎంతో అలరించారు. కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో భాద పడుతున్న కెన్ 2016లో సర్జరీ చేయించుకున్నారు. ఇలాంటి సమయంలో కరోనా కూడా రావడంతో ఆయన కోలుకులేకపోయాడు. జపాన్ లోనూ కరోనా విజృంభిస్తుంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 68 కరోనాతో చనిపోయారు. అందులో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. ఇంకా 1800 కరోనా పాజిటివ్ కేసులు ఆ దేశంలో నమోదయ్యాయి.
 

More Related Stories