జాతి రత్నాలు ఫస్ట్ డే కలెక్షన్స్.. అంచనాలకు మించి..



Jathi Ratnalu
2021-03-12 14:27:37

తెలుగు ఇండస్ట్రీకి మంచి రోజులు కంటిన్యూ అవుతున్నాయి. మిగిలిన ఇండస్ట్రీలో థియేటర్లు ఓపెన్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉంటే.. మన దగ్గర మాత్రం వరస విజయాలు పలకరిస్తున్నాయి. తాజాగా ఈ వారం విడుదలైన జాతి రత్నాలు సినిమా సంచలన ఓపెనింగ్స్ సాధించింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు మొదటి రోజు దాదాపు 5 కోట్ల షేర్ వచ్చింది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన జాతిరత్నాలు అదిరిపోయే కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఎలాంటి లాజిక్స్ లేకుండా కేవలం నవ్వించడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని దర్శకుడు అనుదీప్ చేసిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అందుకే తొలి రోజు ఏకంగా 4.84 కోట్ల షేర్ వసూలు చేసింది జాతి రత్నాలు. చేసిన బిజినెస్ లో దాదాపు సగం కలెక్షన్స్ తొలిరోజు వసూలు చేసింది ఈ సినిమా. రెండో రోజు కూడా అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ కనిపిస్తున్నాయి. దాంతో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తర్వాత నవీన్ పొలిశెట్టి మరో విజయం అందుకున్నాడు. స్వప్న సినిమా బ్యానర్ లో నాగ్ అశ్విన్ ఈ సినిమా నిర్మించాడు. 

More Related Stories