జాతిరత్నాలు ఫస్ట్ వీక్ కలెక్షన్స్



Jathi Ratnalu
2021-03-18 17:47:17

టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లాంటి కామెడియన్ లు టైటిల్ రోల్ పోషించిన సినిమా జాతి రత్నాలు. ఈ సినిమాకు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. సినిమాకు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక శివరాత్రి సందర్భంగా మార్చ్ 11 న ఏ చిత్రం విడుదలయింది. సినిమా కు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ రావడంతో సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి. అంతే కాకుండా మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసింది. ఇక ఇప్పటికీ అదే జోరులో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి 10.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 11.3 కోట్ల షేర్ ను రాబట్టాలి. 

అయితే మూడు రోజుల్లోనే టార్గెట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏడు రోజుల్లో మొత్తం 27. 70 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. అంతే కాకుండా ఎడవరోజు కూడా  1.80 కోట్ల పైన షేర్ ను రాబట్టి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ప్రాంతాల వారిగా కలెక్షన్స్ చూసుకుంటే..నైజాం 10.85కోట్లు, సీడెడ్ 2.79 కోట్లు, ఉత్తరాంధ్ర 3.10 కోట్లు, ఈస్ట్ 1.45 కోట్లు, వెస్ట్ 1.22 కోట్లు, గుంటూరు 1.61 కోట్లు, కృష్ణా 1.35 కోట్లు, నెల్లూరు 0.72 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్ 23.09 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.18 కోట్లు, ఓవర్సెస్ 3.43 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. ఇక మొత్తం వరల్డ్ వైడ్ గా 27.70 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.

More Related Stories