కరోనాకు మరో హాలీవుడ్ నటి బలి..actress
2020-04-08 14:12:47

ఒక్కొక్కరుగా కరోనాతో పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. కరుణ లేని కరోనా అందర్నీ కాటేస్తుంది. ఇప్పటికే ఈ వ్యాధితో చాలా మంది ప్రముఖులు కూడా బాధ పడుతున్నారు. అందులో దేశ ప్రధానులు కూడా ఉన్నారు. బ్రిటీస్ రాణి సైతం కరోనాతో చనిపోయింది. హాలీవుడ్ నటులు కూడా ఇప్పటికే కొందరు చనిపోయారు. ఇప్పుడు మరో ప్రముఖ నటి కూడా చనిపోయింది. కరోనా సోకి ప్రముఖ నటి లీ ఫియర్రో కూడా కరోనాతో మరణించారు. ఈమె వయసు 91 సంవత్సరాలు. ప్రముఖ హాలీవుడ్ దర్శక నిర్మాత స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన కల్ట్ క్లాసిక్ ఫీచర్ 'జాస్'లో లీ నటించారు ఈమె. అందులో ఆమె పోషించిన మిసెస్ కిన్నర్ పాత్ర మంచి పేరు తీసుకొచ్చింది. అమెరికాలోని ఒహియోలో లీ ఫ్యామిలీ నివసిస్తోంది. సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ వారు ఏదో ప్రోగ్రామ్ ప్లాన్ చేసారు కూడా.. అంతలోనే ఈమె కరోనాతో చనిపోవడం విషాదం. ఇక ఈమె కంటే ముందు చాలా మంది కరోనాతో చనిపోయారు. 'స్టార్ వార్స్' యాక్టర్ ఆండ్రూ జాక్ (76), గ్రామీ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ సింగర్ జో డిఫ్ఫే (61), అమెరికన్ మ్యూజిషియన్ అలన్ మెరిల్ (69), జపనీస్ కమెడియన్ కిన్ షిమురా (70), ఇటాలియన్ నటి లూసియా బోస్ (89) తదితరులు కరోనా కారణంగా మరణించారు.

More Related Stories