ఆనంద్ దేవరకొండ నటన నచ్చని వాళ్ళందరూ సైకోలంట !anand
2019-07-17 10:55:38

ట్రైలర్ తో అంచనాలు పెంచుకున్న సినిమా దొరసాని. కానీ రిలీజ్ అయ్యాక ప్రశంసలు అయితే దక్కాయి కానీ సూపర్, బంపర్ అనే విధంగా అయితే లేదు. అందరికీ బాగా రిజిస్టర్ అయిన కధనే తెలంగాణ గడీ నేపధ్యం అనే పాయింట్ ని జోడించి తెరకెక్కించిన ఈ సినిమా అందరికీ చేరువ కాలేకపోయింది. దీంతో ఎంత ప్రమోషన్ చేస్తున్నా వసూళ్లు మాత్రం పెరగడం లేదు. తాజాగా సెలబ్రిటీల కోసం షో వేసింది దొరసాని టీమ్. ఈ టైంలో హీరోయిన్ శివాత్మిక తల్లి జీవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ సినిమా గురించి రివ్యూలు దారుణంగా రాస్తున్నారని ఆమె పెర్కొనది. ఒకప్పుడు సినిమా విడుదలైన వారం తరువాత రివ్యూలు వచ్చేవని కానీ ఇప్పుడు సినిమా చూస్తూనే, ఫలానా టైమ్లో సినిమా స్టార్ట్ అయ్యింది...ఫలానా టైంకి హీరో ఇలా అన్నాడు..హీరోయిన్‌ ఇలా అంటుంది అంటూ ఏవేవో రివ్యూలు రాసేస్తున్నారని చెప్పుకొచ్చింది.  అంతేకాక సినిమాలో ఆనంద్ దేవరకొండ చాల గొప్పగా నటించారని సినిమా చూశాక కూడా ఆ మాట అన్నారంటే అలా అన్నవాళ్ళు సైకోలని లేదా అంతకు మించి అని ఆమె పేర్కొంది. నటన బాలేదు అన్న వారంతా సైకోలని ఆవిడ భావం అన్నమాట. ఏంటో మరి ట్రోల్స్, ని రివ్యూలని పాజిటివ్ గా తీసుకుని నటనను ఎలా మెరుగు పరుచుకువాలో చూడాలి కానీ, అలా అ వాళ్లందరిని సైకోలు అనేయడం ఏమిటో ఆవిడకే తెలియాలి. మొదటి సినిమాకే ఎవరూ అద్భుతాలు చేయరు, నేటి సూపర్ స్టార్స్ అనుకుంటున్నా పవర్ స్టార్, ప్రభాస్ లాంటి వాళ్ళు కూడా.  

More Related Stories