మా రచ్చ...వీడియో రిలీజ్ చేసిన జీవితJeevitha Rajasekhar
2019-10-22 10:48:02

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన మా అసోసియేషన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడు నరేష్ లేకుండానే అత్యవసర సమావేశాన్ని మొన్న ఆదివారం రోజున జీవిత రాజశేఖర్ నిర్వహించారు. దీనితో మా అసోసియేషన్ లో గందరగోళం నెలకొంది. మా అసోసియేషన్ లో సభ్యులు నరేష్ వర్గం, జీవిత రాజశేఖర్ వర్గంగా చీలిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి అనేక వార్తలు వస్తుండడంతో తాజాగా జీవిత స్వయంగా వివరణ ఇచ్చారు. ఈ సమావేశం నిర్వహించడానికి ‘మా’ కార్యవర్గం ఆమోదం ఉందని ఆమె పేర్కొన్నారు. 

ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని విడుడల చేశారు. తమ నుండి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని ఈ వీడియో విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘మా’ సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారని, ఇంత గందరగోళ పరిస్థితుల్లో కూడా హాజరయిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో సాయంత్రం వరకూ పలు విషయాల పై చర్చించామని ఆమె చెప్పుకొచ్చారు. అయితే కొంతమంది కమిటీ సభ్యుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయని, అనేకానేక కారణాల వల వాటిని పరిష్కరించలేకపోయామని చెప్పకొచ్చారు. మొత్తానికి తమ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని జీవితా ఒప్పుకున్నట్టు అయ్యింది.
 

More Related Stories