నా కూతుళ్లను వదిలేయండి అంటున్న జీవితా రాజశేఖర్..jeevi
2020-02-01 02:34:18

తెలుగు ఇండస్ట్రీలో హీరోల వారసులు తప్ప వారసురాళ్లు రావడం తక్కువ. కానీ రాజశేఖర్ కుటుంబం నుంచి ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్లు కావడానికి ఇండస్ట్రీకి వచ్చారు. తల్లి జీవిత ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలో అవకాశాల కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్నకూతురు శివాత్మిక రాజశేఖర్ ఇప్పటికే దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక పెద్ద కూతురు శివాని కూడా నేడో రేపో ఇండస్ట్రీకి రావడం ఖాయం. అయితే తమ కూతుళ్లను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని.. దయచేసి అలా చేయొద్దు అంటూ జీవిత రాజశేఖర్ నెటిజన్లను వేడుకుంటుంది. వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ని తీసుకొచ్చి నెట్టింట్లో పెట్టేస్తున్నారు. అది చాలా తప్పు కదా.. మా పిల్లల్లో ఉన్న మంచిని మాత్రమే చూపియండి.. చెడును అనవసరంగా సోషల్ మీడియాలో పెట్టి  వాళ్ల ప్రైవేట్ లైఫ్ ను  ఇబ్బంది పెట్టొద్దు అంటూ  కోరుకుంటుంది జీవిత. ఈ మధ్య రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన చూసి చూడంగానే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన జీవిత..

అక్కడ చాలా ఎమోషనల్ అయ్యింది. తనకు కూతుర్లు శివాని.. శివాత్మిక ఎంతో శివ కందుకూరి కూడా అంతేనని.. కొడుకు లాంటివాడని.. ఈ పిల్లల భవిష్యత్తు గురించి చాలా సార్లు తమ మధ్య చర్చలు జరిగాయని.. ఇప్పుడు శివ 'చూసీ చూడంగానే' సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది జీవిత రాజశేఖర్. ఈ పిల్లలు ఎంతో ఆశతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారని.. వారిని ప్రోత్సహించాలని మీడియాతో పాటు... సినిమా ప్రేక్షకులను కోరింది జీవిత. అయితే కొందరు మాత్రం కావాలనే తమ పిల్లల ప్రైవేట్ లైఫ్ ను ఇబ్బంది పెట్టేలా సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ చేస్తున్నారని.. దయచేసి ఇలాంటివి చెయ్యొద్దు అంటూ వేడుకుంటుంది జీవితా రాజశేఖర్. ఈమె అడిగినంత మాత్రాన అది ఆపుతారా అనేది ఆసక్తికరమే.

More Related Stories