జీవితా రాజశేఖర్ వన భోజనాలు.. హాజరైన ఇండస్ట్రీ పెద్దలు.. Jeevitha Rajasekhar
2019-11-25 19:09:38

కార్తీకమాసంలో వనభోజనాలు ఏర్పాటు చేయడం సాధారణం. అలాగే ఇండస్ట్రీలో  కొందరు పెద్దలను పిలిచి  జీవిత రాజశేఖర్ కూడా వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ కు  కాస్త దూరంగా ఉన్న ఈ వన భోజనాల కార్యక్రమం జరగనుంది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ వనభోజనాల ఆనవాయితీ మొదలుపెట్టాడు. అక్కడి నుంచి  తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఎవరూ పెద్దగా వనభోజనాల పై ఆసక్తి చూపించలేదు. 

అయితే ఇప్పుడు  జీవిత రాజశేఖర్ ఈ ట్రెండ్ ఫాలో అయ్యారు. ఈ వనభోజన కార్యక్రమానికి ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోల దగ్గర నుండి చిన్న నటీనటుల వరకు జీవిత వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏ టాప్ హీరో చేయని విధంగా జీవిత రాజశేఖర్ దంపతులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంతమంది టాప్ సెలెబ్రెటీలు వస్తారు అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 'మా' అసోసియేషన్ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయిన నేపధ్యంలో ఈ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జీవిత రాజశేఖర్ అందరినీ వనభోజనాలకు పిలిచినట్టు తెలుస్తోంది. టాప్ హీరోలతో పాటు యంగ్ హీరోలను కూడా ఆహ్వానించారు జీవిత రాజశేఖర్. దంపతులు సుమారు 400 నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారు అంటూ జీవిత ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. 

ఇక ఈ కార్యక్రమంలో లైవ్ మ్యూజిక్ తో పాటు కొన్ని స్కిట్స్ కొన్ని గేమ్స్ కూడ జీవిత ప్లాన్ చేసినట్లు సమాచారం. తెలంగాణ ఆంధ్రా ప్రాంతాలకు సంబంధించిన రుచులతో సుమారు 27 రకాల వంటలతో ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇదే సందర్భంలో జీవిత మాట్లాడుతూ రాజశేఖర్ హీరోగా నటించబోయే తర్వాతి సినిమా జనవరిలో మొదలవుతుందని క్లారిటీ ఇచ్చింది. ఇక తన కూతురు శివాని హీరోయిన్ గా నటిస్తున్న 'అద్భుతం' అనే సినిమా కూడా జనవరిలోనే మొదలు కానుందని కన్ఫర్మ్ చేసింది జీవిత.
 

More Related Stories