జీవిత డైరెక్షన్ లో రాజశేఖర్ సినిమాJeevitha
2021-02-02 17:50:54

జీవిత రాజశేఖర్ ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సినిమాల్లో సూపర్ జోడిగా పేరు తెచ్చుకున్న ఈ జోడి రియల్ లైఫ్ లోనూ సూపర్ జోడి అని పలు సంధర్భాల్లో అనిపించుకున్నారు. రాజశేఖర్ సినిమాలకు జీవిత దగ్గరుండి అన్నీ తానై చూసుకుంటుందని టాక్ కూడా ఉంది. గతంలో కూడా దర్శకులు అలిగివెళ్ళిపోతే జీవిత సినిమాలు పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం..రాజశేకర్ హీరోగా నీలకంఠం దర్శకత్వంలో ఓ సినిమా మొదలవ్వాల్సి ఉందట. మలయాళ సినిమా "జోసెఫ్ " కు రీమేక్ చిత్రంగా ఈ సినిమాను ప్లాన్ చేసారు. కానీ క్రియేటివ్ విబేధాల కారణంగా నీలకంఠం ఆ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారట. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. అయితే ఈ సినిమా పూర్తి భాద్యతను జీవితే తీసుకుందట. అంతే కాకుండా సినిమాకు జీవిత స్వయంగా దర్శకత్వం వహించబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే గనక నిజమైతే జీవిత రాజశేకర్ కాంబినేషన్ లో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో చూడాలి.   

More Related Stories