పూరీ - దేవరకొండ సినిమా నుండి షాకింగ్ అప్డేట్ ? Jhanvi Kapoor
2019-08-17 16:38:27

ఈ మధ్య కాలంలో ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టిన పూరీ జగన్నాధ్ విజయ్ దేవరకొండతో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అయితే ప్రకటించారు కానీ సినిమా గురించి మరే ఇతర వివరాలు ప్రకటించలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ హీరోగా పూరి తన బ్యానర్ పై సినిమా తీయబోతున్నాడు. అయితే ఈ సినిమాకి హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలానటి అందాల తార కూతురు జాన్వీ కపూర్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ చర్చల కోసం వర్మ అండతో ఛార్మీ రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. విజయ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాలో ఈ భామను కూడా ఎంటర్ చేస్తే మరింత క్రేజ్ ఏర్పడుతుందని, ఆ క్రేజ్ సినిమాకి మరింత బూస్ట్ ఇస్తుందని ఆమెను అనుకుంటున్నారని చెబుతున్నారు.  ఆమధ్య ఓ హిందీ టీవీ షోలో జాన్వీ తన ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని అతడితో కలిసి నటించాలనుందని చెప్పి పెద్ద చర్చకే తావిచ్చింది. దీంతో ఆమె ఈ సినిమా ఒప్పుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈమె 'తక్త్' అనే పైలట్ బయోపిక్ మూవీలొ నటిస్తోంది. త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ సినిమాను పూరీ తన సొంత బ్యానర్‌ లోనే నిర్మించనున్నాడు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ బ్యానర్ లు ఈ సినిమాని నిర్మించనున్నాయి. తన వ్యాపార భాగస్వామి అయిన ఛార్మి కూడా ఈ సినిమాకి సహనిర్మాత. ప్రొడక్షన్ బాధ్యతలు అన్నే ఛార్మీనే దగ్గరుండి చూసుకోనుందని అంటున్నారు.  

More Related Stories