సల్మాన్‌పై జియాఖాన్ తల్లి సంచలన ఆరోపణలుJiah Khan
2020-06-18 15:18:48

బాలీవుడ్‌ యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ బలవన్మరణం ప్రతి ఒక్కర్నీ కలచివేస్తోంది. సుశాంత్‌ మృతికి సంతాపం తెలుపుతూ గతకొన్నిరోజుల నుంచి నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. అంతే కాకుండా బాలీవుడ్‌కు చెందిన కొంతమంది వ్యక్తుల ప్రవర్తన వల్ల సుశాంత్‌ ఎన్నో సందర్భాల్లో తీవ్ర మనస్తానికి గురయ్యారని చివరికి ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంటున్నారు. దీంతో 'బాయ్‌కాట్‌ బాలీవుడ్‌' అంటూ సోషల్‌మీడియాలో వరుస ట్వీట్లు దర్శనమిస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు సల్మాన్ ఖాన్, ఏక్తా కపూర్, కరణ్ జోహార్. మిగతా వారి విషయాలు ఎలా ఉన్నా సల్మాన్‌పై ఆరోపణలు పెరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ పై దివంగత నటి జియాఖాన్ తల్లి రబియా అమీన్ తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు. 2015లో జియాఖాన్ అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఈ కేసులో బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలి మీద అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ఈ కేసు వీగిపోయేలా సల్మాన్ ఖాన్ తన ఇన్ఫ్లూయన్స్ వాడాడని తాజాగా రబియా అమిన్ ఇప్పుడు ఆరోపించారు. ఆయన తన మనీ పవర్ ను ఉపయోగించారని సీబీఐకి చెందిన ఓ అధికారి తనకు చెప్పినట్టు ఆమె ఆరోపించారు. సల్మాన్ తనకు ప్రతిరోజు ఫోన్ చేసే వాడని సూరజ్ పంచోలిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేవాడని సదరు అధికారి తనతో చెప్పారని ఆమె ఆరోపిస్తున్నారు. నిజానికి మరణానికి ముందు సూరజ్ పంచోలితో జియాఖాన్ ప్రేమలో ఉంది. దీంతో ఆమె చావుకు సూరజ్ పంచోలీనే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి.

More Related Stories