శోభన్ బాబుగా సైకో విలన్ Jisshu Sengupta
2020-02-18 19:14:40

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్ లలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు సంబంధించిన వారి జీవిత చరిత్రను తెరపై చూపించే ప్రయత్నం చేస్తు హిట్స్ కొట్టేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా కూడా సినిమా తీస్తున్నారు. ‘తళైవి’ పేరుతో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. దీంట్లో జయలలితగా కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

అంతకు ముందు హీరోయిన్ గా ఉన్న సమయంలో నటుడు శోభన్ బాబుతో  జయకు మంచి అనుబంధం ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ కోసం చాలా మంది ఆసక్తిగా చూసేవారు. అందుకే ఈ మూవీలో ఆయనకు, జయలలితకు మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయట. ఆ పాత్ర కోసం ముందుగా విజయ్ దేవరకొండను అనుకున్నా విజయ్ బిజీ గా ఉండంతో త్వరగా సినిమా రిలీజ్ చేయలానే హర్రీలో ఉన్న మేకర్స్ ఆ ప్లేస్ లో మరో నటుడ్ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. 

ఇప్పుడు ఆ పాత్రలో  బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తాను తీసుకున్నట్టు సమాచారం. ఆయన పాత్రకు జిషు న్యాయం చేయగలడని భావించి అతన్ని ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. జిషు ఇటీవల తెలుగులో వచ్చిన ‘అశ్వద్ధామ’లో విలన్‌ పాత్రలో నటించాడు. ఇప్పుడు ఈయనే శోభన్ బాబు క్యారెక్టర్ చేయనున్నాట. ఈ సినిమాకి అమలా పాల మాజీ భర్త ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా జూన్ 26 ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Related Stories