రకుల్ ప్రీత్ సింగ్ సినిమా పై రాళ్ళ దాడి



 Attack movie
2021-02-23 17:45:35

గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మొదట బాలీవుడ్ లో ఒక సినిమా తీసి ఆ తరవాత టాలీవుడ్ లో జాతకాన్ని పరీక్షించుకుంది. అయితే ఇక్కడ మొదటి సినిమానే హిట్ అవ్వడం ఆ తరవాత వరుస ఆఫర్లు దక్కించుకోవడంతో టాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. ఇక ప్రస్తుతం మళ్ళీ బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడ..ఇక్కడ కవర్ చేస్తూ సినిమాలు తీస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా వస్తున్న "ఎటాక్  " సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దనిపూర్ లో జరుగుతోంది. అయితే షూటింగ్ జరుగుతున్న సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున వీక్షించేందుకు అక్కడకు చేరుకున్నారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చెయ్యగా ఆగ్రహానికి లోనైన స్థానికులు రాళ్ళ దాడికి దిగారు. దాంతో సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. కానీ ఈ దాడిలో రకుల్ ప్రీత్ సింగ్, హీరో జాన్ అబ్రాహం కి ఎలాంటి ప్రమాదం జరగనట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రకుల్ టాలీవుడ్ లో నితిన్ హీరోగా నటించిన "చెక్" సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానుంది.

More Related Stories