ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ మళ్లీ అ అక్షరంతోనే టైటిల్..ntr
2020-01-25 06:47:54

ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అప్పట్లో విశ్వనాథ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా ఎస్ అనే అక్షరంతోనే తన సినిమా టైటిల్ పెట్టేవాడు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అంతే. ఈయన కూడా తన సినిమాలకు అ అనే అక్షరంతోనే టైటిల్స్ పెట్టడం అలవాటుగా చేసుకున్నాడు. అతడు, అత్తారింటికి దారేది, అ..ఆ, అజ్ఞాతవాసి.. ఈ మధ్యే అల వైకుంఠపురములో ఇలా చాలా సినిమాలకు అ తోనే తన టైటిల్స్ మొదలుపెట్టాడు మాటల మాంత్రికుడు. త్వరలోనే ఈయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈయన 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత తారక్ తో సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్. అన్నీ కుదిర్తే జులై నుంచి ఈ చిత్రం పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఇప్పుడు ఈ సినిమాకు హీరోయిన్ తో పాటు టైటిల్ కూడా ఫిక్సయిందని తెలుస్తుంది. దీనికి 'అయిననూ పోయిరావలె.. హస్తినకు' అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడని ప్రచారం జరుగుతుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అ అనే అక్షరంతో టైటిల్ మొదలైంది కాబట్టి కచ్చితంగా ఇది నిజమే అంటున్నారు గురూజీ అభిమానులు.

 

More Related Stories