రంజాన్ ప‌ర్వ‌దినాన ఎన్టీఆర్ గుడ్ న్యూస్



Jr NTR
2021-05-14 12:06:01

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ తన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ఈరోజు రంజాన్ సంధర్బంగా ఎన్టీఆర్ ముస్లిం సోదరులకు..అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుతం మెల్లి మెల్లిగా కొలుకుంటున్నట్టు తెలిపారు. అంతే కాకుండా త్వరలోనే పూర్తిగా కోలుకుని మీ ముందుకు వస్తానని పేర్కొన్నారు. మీ ప్రేమ అనురాగాల వల్లే త్వరగా కొలుకుంటున్నా అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

తన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్త గా ఉండాలని..మస్కులు ధరించాలని తెలిపారు. ఇక మరో ఆరు రోజుల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరవాత కొరటాల  దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. అంతే కాకుండా ప్రశాంత్ నీల్ తోనూ ఓ సినిమా ఉంటుందని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేసారు.

More Related Stories