అట్లీతో ఎన్టీఆర్ ప్రేమ‌క‌థjr ntr
2021-07-06 23:43:52

అట్లీతో తార‌క్ సినిమా గురించి ఎప్ప‌ట్నుంచో చ‌ర్చ జ‌రుగుతోంది.  వైజయంతి మూవీస్ నిర్మాణంలో ఈ కాంబినేష‌న్ సెట్ కావ‌చ్చ‌న్ని చాన్నాళ్లుగానే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇటీవ‌లే అట్లీ తార‌క్‌కు ఓ క‌థ చెప్పాడ‌ట. ఎన్టీఆర్ లైన్ విని ఓకే చెప్పారు.ప్రస్తుతానికి ఎన్టీఆర్ మూవీ కోసం స్క్రిప్టును రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

తారక్ - అట్లీ కాంబినేషన్ మూవీ ఎలా ఉండనుంది? అంటే రాజా రాణి తరహాలోనే పూర్తి ప్రేమకథా చిత్రమని ఎన్టీఆర్ ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకుని స్క్రిప్టును రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్‌లో న‌టిస్తున్న ఎన్టీఆర్.. త‌ర్వాత కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు చేయాల్సి ఉంది. ఈలోపు అట్లీ.. షారుఖ్ ఖాన్ సినిమాను పూర్తి చేస్తాడు. ఆ తర్వాత అట్లీతో సినిమా సెట్స్ కెళ్లేందుకు ఆస్కారం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

More Related Stories