ఎన్టీఆర్ కి జాన్వీనే హీరోయినాJr NTR
2020-09-07 17:14:14

అలనాటి అందాల తార శ్రీదేవీ కుమార్తె జాన్వీ కపూర్. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది ఈ భామ. ఆ సినిమా హిట్ అయిన తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎన్టీఅర్ తదుపరి సినిమా ఉంబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ముందు ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రష్మిక ను తీసుకుంటున్నట్టు కూడా పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. ఆ తరువాత మళ్ళీ సమంత పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందని అందుకే ఒక హీరోయిన్ గా సమంతను తీసుకోనున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద అయితే క్లారిటీ లేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఇందులో మళ్ళీ జాన్వీ కపూర్ ని ఈ సినిమా కోసం రోప్ చేసినట్టు చెబుతున్నారు.  తన గ్లామర్ తో బాలీవుడ్ కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తున్న జాన్వీని ఈ ప్రాజెక్ట్ లో తీసుకోవాలనుకుంటున్నారనేది తాజాగా మొదలయిన ప్రచారం. ఈ సినిమా పొలిటికల్ టచ్ తో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నారు. అయితే గతంలో చిరంజీవి నటించిన మంత్రిగారి వియ్యంకుడు సినిమా పాయింట్ తోనే త్రివిక్రమ్ స్టోరీ రాసుకుంటున్నాడని అంటున్నారు. అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఈ చిత్రానికి ప్రచారంలో ఉంది.  

More Related Stories