సైరాపై జూనియర్ ఎన్టీఆర్ నోరు మెదపడే.. కారణమేంటి..ntr
2019-10-09 19:19:00

చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తుంది. మిగిలిన భాషల సంగతి పక్కనబెడితే మన దగ్గర మాత్రం సినిమా దుమ్ము దులిపేస్తుంది. అలాగే ప్రశంసల విషయంలో కూడా ఎక్కడా తగ్గడం లేదు ఈ చిత్రం. చిరు నటనకు.. ఆయన ఆహార్యానికి.. ఈ వయసులో ఆయన పడిన కష్టానికి అంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పటికే చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు కూడా. కానీ నందమూరి కుటుంబం మాత్రం సైలెంట్ గా ఉంది.  బాలయ్య అంటే ఓకే కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనిపై నోరు మెదపకుండా ఉండటం సందేహాలకు తావిస్తుంది.

ఇండస్ట్రీలో ఇప్పటికే సైరా చూసిన వాళ్లలో ఎన్టీఆర్ అత్యంత సన్నిహితుడు రాజమౌళి కూడా ఉన్నాడు. ఈయన సైరా అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేసాడు. దానికితోడు రామ్ చరణ్ తో ఎన్టీఆర్ చాలా స్నేహంగా ఉంటాడు. అన్నాతమ్ముడు అన్నట్లు ఉంటారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు సైరా సినిమాపై స్పందించకపోవడం నిజంగానే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల సినిమా చూసే అవకాశం దక్కలేదేమో అనుకుంటే.. రాజమౌళి చూసాడు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి చూడాలిక.. ఎన్టీఆర్ ఈ విషయంపై ఎప్పడు మాట్లాడతాడో..?

More Related Stories