జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఆ ఒక్క సినిమా విడుదల కాలేదబ్బా..Jr NTR
2020-07-21 16:54:59

జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా విడుదల కాకపోవడం ఏంటి.. ఆయన నటిస్తే చాలు విడుదల చేయడానికి చాలామంది డిస్ట్రిబ్యూటర్ నిలబడతారుకదా.. అలాంటిది ఆయన సినిమా విడుదల కాకపోవడం ఏంటి అనుకుంటున్నారా. నిజమే జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పుడున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈయన కెరీర్లో ఒకటి విడుదల కాని సినిమా ఉంది. అది కూడా అలాంటి ఇలాంటి సినిమా కాదు.. తాత సీనియర్ ఎన్టీఆర్ తో నటించిన సినిమా. అవును బాల రామాయణం సినిమా కంటే రెండేళ్ల ముందే మొహానికి రంగేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చేశాడు. ఇదే సినిమాని హిందీలో కూడా రీమేక్ చేశాడు సీనియర్ ఎన్టీఆర్. ఇందులో విశ్వామిత్రుడిగా సీనియర్ ఎన్టీఆర్.. దుశ్యంతుడిగా బాలకృష్ణ నటించారు.

ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసినప్పుడు కూడా ఆ పాత్రల్లో ఇద్దరూ నటించారు. కానీ తెలుగులో అనూహ్యంగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వెర్షన్ విడుదల చేయలేదు సీనియర్ ఎన్టీఆర్. అందులో దుశ్యంతుడి కుమారుడిగా జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సమయంలో హిందీ అనర్గళంగా మాట్లాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ను చూసి బ్రహ్మర్షి విశ్వామిత్ర ఛాన్స్ ఇచ్చాడు సీనియర్ ఎన్టీఆర్. అలా తాతతో ఆ రోజుల్లోనే నటించే అవకాశం అందుకున్నాడు జూనియర్. కానీ ఏం చేస్తాం దురదృష్టం కొద్దీ ఈ సినిమా బాక్సులోనే ఆగిపోయింది. ఆ తర్వాత రెండేళ్లకు బాల రామాయణం సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్యే ఈ సినిమా 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. అలా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో విడుదల కాని సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర నిలిచిపోయింది.

More Related Stories