మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో జూనియర్ ఎన్టీఆర్ పక్కా లోకల్ పాట..Jr NTR
2020-03-12 22:57:26

మన తెలుగు హీరోల చేతి ఖండాంతరాలు దాటి వ్యాపిస్తుంది. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమాల గురించి ప్రపంచం మొత్తం ఆరా తీస్తుంది. ముఖ్యంగా మన హీరోలకు ఇతర దేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఫారెన్ లో సెటిల్ అయిన ఇండియన్స్ మన హీరోలను అక్కడి ప్రేక్షకులకు కూడా పరిచయం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన మరోసారి జరిగింది.

 ఈ మధ్య మార్చి 8న జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ పాట వినిపించింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరచిన పక్కా లోకల్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ ఈ పాటకి అదిరిపోయే స్టెప్పులు వేసి ఫ్యాన్స్‌ని అలరించారు. ఇప్పటికీ ఈ పాటను చాలా వేడుకల్లో ప్లే చేస్తుంటారు.. డాన్సులు కూడా చేస్తుంటారు. ఈ క్రమంలోనే మార్చి 8న మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లోను ఈ సాంగ్ ప్లే కావడం గమనార్హం. 

ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ కోసం దాదాపు 82000 మంది హాజరయ్యారు. ఇందులో ఎక్కువ శాతం భారతీయులే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మ్యాచ్ జరిగే సమయంలో పక్కా లోకల్ అనే సాంగ్ ప్లే కావడంతో ఆడియన్స్ ఈ పాటకి స్టాండ్స్‌లో స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు ఈ వీడియోని జై బాలయ్య జై బాలయ్య నినాదాలతో  సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ పాటను చూసి నందమూరి అభిమానులు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. 

More Related Stories