ఎంత మంచివాడవురా.. జూనియర్ ఎన్టీఆర్ ఔదార్యం..Jr NTR
2020-05-08 18:10:34

కరోనా మహమ్మారితో ఇప్పుడు జన జీవనం స్థంభించిపోయింది. ముఖ్యంగా చాలా మంది బతుకులు అతలాకుతలం అయిపోయాయి. తినడానికి కూడా తిండి లేక.. చేసుకోడానికి పనుల్లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఎవరి దగ్గర పని చేస్తున్న వాళ్లను యజమానులే సరిగ్గా చూసుకోవాలని ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి. ఇప్పుడు దీన్ని జూనియర్ ఎన్టీఆర్ తూచా తప్పకుండా పటిస్తున్నాడు. ఇప్పటికే ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్లకు తన వంతు సాయాన్ని అందించిన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు తన దగ్గర పని చేసే వారికి కూడా కొండంత అండగా నిలిచాడు. తన దగ్గర పని చేస్తున్న స్టాఫ్‌తో పాటు వాళ్ల కుటుంబాలకి కూడా అండగా నిలిచాడు యంగ్ టైగర్. స్టాఫ్ అందరికి అడ్వాన్స్‌ వేతనం అందించిన ఎన్టీఆర్.. రానున్నరోజులలో కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మీ అందరికి నేనున్నాననే భరోసా కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో ఎన్టీఆర్ ఔదార్యాన్ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం RRR తో పాటు త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు జూనియర్. 

More Related Stories