జూనియర్ ఎన్టీఆర్ ప్రోమో...ఎవరు మీలో కోటీశ్వరుడు



Jr NTR
2021-02-24 17:34:17

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర పై సందడి చేయనున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జితెలుగు లో బిగ్ బాస్ లాంటి ఓ రియాలిటీ షోకు హోస్ట్ గా చేయబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాకు హోస్ట్ గా రానున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ బుల్లి తెర ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. అయితే బిగ్ బాస్ లాంటి షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తారని వచ్చిన వార్తలు ఎంత వరకు నిజమో గాని...మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో మాత్రం ఎన్టీఆర్ హోస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. దానికోసం ఎన్టీఆర్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకర్స్ లో ప్రోమో షూట్ లో పాల్గొంటున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ పై ప్రోమో లను షూట్ చేస్తున్నారు. ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ లో ఈ షో ప్రసారం కానుంది. అయితే మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ఉన్న షోకు ఎవరు మీలో కోటీశ్వరుడు అని పేరు మార్చారు. ఇక మార్చ్ ఫస్ట్ వీక్ నుండి ఏ షోకోసం ఎంట్రీస్ మొదలవుతాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆడిషన్స్ కి వెళ్లి ఎన్టీఆర్ ను కలవడమే కాకుండా..డబ్బు గెలుచుకోవచ్చు.
 

More Related Stories