ఆర్ఆర్ఆర్ నుండి సర్ప్రైజ్...చెర్రీ బర్త్ డేకి బుడ్డోడి గిఫ్ట్rrr
2020-03-27 02:59:25

జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ముందు సినిమా బాహుబలి ఇచ్చిన బూస్ట్ ఇప్పుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ కి ఎక్కడ లేని క్రేజ్ తెచ్చిపెట్టింది. అది కాక తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు పెద్ద కుటుంబాలకి చెందినా హీరోలు రామ్ చరణ్, నందమూరి తారక రామారావులు కలిసి మొదటిసారిగా నటిస్తుండడంతో ఈ సినిమా మీద ఎనలేని ఆసక్తి కనబరుస్తున్నారు తెలుగు జనాలు. ఈ సినిమా వాస్తవానికి ఈ ఏడాది జూలై నెలలో రిలీజ్ కావాల్సి ఉన్నా పలు కారణాల దృష్ట్యా అది వాయిదా పడింది. వచ్చే ఏడాది సంక్రాంతి అని అన్నా ఇప్పుడు అది కూడా కరోనా దెబ్బకి డౌటే. అయితే మొన్ననే ఈ సినిమా టైటిల్ అలాగే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన కొద్దిసేపటిలోనే అది విపరీతంగా వైరల్ అయింది. ఇక చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే ఆ విషయాన్ని ఎన్టీఆర్ ప్రకటించాడు. ఈరోజే ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన చరణ్ ని ఉద్దేశిస్తూ నేను నీ పుట్టిన రోజును వేరే పరిస్థితుల్లో చేద్దామని అనుకున్న, కానీ మనం లాక్ డౌన్ లో ఉన్న కారణంగా మనం ఇళ్ళలో ఉండడం తప్పని సరి. అందుకే నీకొక డిజిటల్ సర్ప్రైజ్ ఇస్తా..రేపు పదింటికి రెడీగా ఉండు, నన్ను నమ్ము ఇది నువ్వు మరచిపోలేనిది అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కి చరణ్ వెంటనే రిప్లై కూడా ఇచ్చాడు. నేను సరయిన సమయానికి ట్విట్టర్ లోకి వచ్చానుకుంటా, లేదంటే నీ సర్ప్రైజ్ మిస్సయ్యే వాడిని, రేపటి కోసం ఆగలేకున్నా అని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ కి #bheemforramaraju అనే హ్యాష్ ట్యాగ్ పేర్కొన్నాటు. రేపటి సర్ప్రైజ్ ఏంటో చూడాలి మరి.

 

More Related Stories