ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా నుండి ఆసక్తికర అప్డేట్  Jr NTR Trivikram
2020-09-09 12:23:52

యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎన్టీఅర్ తదుపరి సినిమా ఉంబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. రకరకాల పేర్లు అయితే వినిపిస్తూ వచ్చాయి కానీ ఎవరి పేరును ఇంకా ఫైనల్ చేయలేదు. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్నారైగా ఆయన కనిపించబోతున్నాడని ఒకసారి రాజకీయ నాయకుడి కొడుకుగా కనిపించానున్నాడని ఒకసారి ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రివిక్రమ్ జాన్వీ కపూర్ ని ఈ సినిమా కోసం తీసుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. 

అయితే ఈ షూట్ కి ఇంకా ప్రారంభం కాలేదు. అయితే వెంక‌టేష్ 75వ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ చేయ‌బోతున్నారంటూ వ‌రుస క‌థ‌నాలు రావ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ నిర్మాణ సంస్థ మీద విరుచుకు పడ్డారు. వెంట‌నే సదరు నిర్మాత ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఎన్టీఆర్ సినిమాని ఈ దసరాకి లాంచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.  వీలయినంత త్వరలో సెట్స్ మీదకు కూడా తీసుకువెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. 

More Related Stories