జూనియర్ ఎన్టీఆర్ ముఠామేస్త్రి అవుతున్నాడట..Jr NTR
2020-07-01 20:35:21

అదేంటి ముఠామేస్త్రి చిరంజీవి కదా.. జూనియర్ ఎన్టీఆర్ కావడం ఏంటి అనుకుంటున్నారా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. అల వైకుంఠపురంలో లాంటి ఆల్ టైం బ్లాక్బస్టర్ తర్వాత మాటల మాంత్రికుడు చేయబోయే ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దీనికి అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. హారిక హాసిని క్రియేషన్స్ తో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది అని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ కు సరిపోయేలా త్రివిక్రమ్ ఒక అద్భుతమైన కథ సిద్ధం చేశాడని ప్రచారం జరుగుతుంది. అయితే తన ప్రతి సినిమా కోసం ఏదో ఒక ఈ కథను ఆధారంగా చేసుకుంటాడు త్రివిక్రమ్. ఎక్కడో ఒక చోట నుంచి ఒక పాయింట్ తీసుకుంటాడు.. మిగిలిన ట్రీట్మెంట్ మొత్తం తన స్టైల్లో ఇస్తుంటాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం కూడా ముఠామేస్త్రి లైన్ తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. 

దాదాపు 30 ఏళ్ల కింద వచ్చిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు తిరగరాసింది. అందులో మార్కెట్ యార్డ్ లో ఉండే చిరంజీవి అనుకోకుండా రాజకీయాల్లోకి వస్తాడు.. మంత్రి అవుతాడు.. ఆ తర్వాత సత్తా చూపిస్తాడు. అచ్చంగా ఇప్పుడు అయినను పోయిరావలె హస్తినకు సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. బిజినెస్ మ్యాన్ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వస్తుందని.. వచ్చిన తర్వాత తనదైన ముద్ర ఎలా వేశాడు అనేదే ఈ సినిమా కథ అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో ఖచ్చితంగా మరోసారి ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాస్తానని ధీమాగా కనిపిస్తున్నాడు త్రివిక్రమ్. ఇదే ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టి 2021 సమ్మర్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఒకవేళ నిజంగానే ముఠామేస్త్రీ లైన్ తో ఎన్టీఆర్ సినిమా వస్తే అభిమానులకు పండగే.

More Related Stories