వకీల్ సాబ్ చూసి పవన్ ను హగ్ చేసుకున్న తారక్



Vakeel Saab
2021-04-14 14:47:16

రీఎంట్రీ తరవాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఎప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ప్రేక్షకులతో పాటు సెలబ్రెటీలు సైతం వకీల్ సాబ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు తో పాటు పలువురు యంగ్ హీరోలు సినిమా పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. 

కాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా వకీల్ సాబ్ పై ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వకీల్ సాబ్ చూసిన ఎన్టీఆర్...పవన్ కళ్యాణ్ ను హగ్ చేసుకుని మరీ అభినందించారట. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వకీల్ సాబ్ సినిమాను చాలా ఇంట్రెస్ట్ పెట్టి తీశామని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇప్పుడు కష్టానికి తగ్గినఫలితం వచ్చిందని. సినిమా సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అంతే కాకుండా పవన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ప్రకాష్ రాజ్ తెలిపారు. 

అంతే కాకుండా తనకు పవన్ కళ్యాణ్ తో ఎలాంటి విభేదాలు లేవని కేవలం రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. అంతే కాకుండా తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని అందుకే విమర్శించానని చెప్పారు.

More Related Stories