జయరాజ్ ఫీనిక్స్ లకు సెలబ్రిటీల సంతాపంJayaraj And Fenix
2020-06-27 14:25:47

కర్ఫ్యూ టైంలో షాపు తెరచారని తండ్రీ కొడుకులని స్టేషన్ తీసుకెళ్లి చితక్కొట్టడంతో మరణించిన దారుణ సంఘటన తమిళనాడులో జరిగింది. ఈ  ఘటన తుత్తుకుడి అనే టౌన్ లో ఈ నెల జూన్ 24న జరిగింది. అది ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద విషయంగా మారింది. ఎలా అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుట్ ఆత్మహత్య విషయంలో సామన్య జనం సహా సెలబ్రిటీలు స్పందించారో వీరి విషయంలో కూడా అలానే స్పందిస్తున్నారు. తుత్తుకుడికి చెందిన జయరాజ్ (60) మరియు ఆయన కొడుకు ఫీనిక్స్ (30) ఒక మొబైల్ దుకాణాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా విజృంభిస్తుండటంతో మళ్లీ లాక్డౌన్ విధించారు. 

ప్రతిరోజూ కొంతసమయం షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. దాంతో తండ్రీకొడుకులు కూడా తమ మొబైల్ షాపును తెరచారు. కానీ.. కర్ఫ్యూ మొదలయ్యే టైంకి మూయలేదు. దాంతో అటుగా వచ్చిన పోలీసులు.. జయరాజ్ ను ప్రశ్నించారు. పోలీసులకు, జయరాజ్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో ఫీనిక్స్ కూడా కలగజేసుకొని పోలీసులతో మాట్లాడాడు. వెంటనే కోపోద్రిక్తులైన పోలీసులు.. వారిద్దరిని అదుపులోకి తీసుకొని సాతంకుళం పోలీసుస్టేషనుకు తీసుకెళ్లారు. వారు అలానే లాకప్ లో ఒకరి తర్వాత ఒకరు మరణించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ పోలీసులకు శిక్ష పడాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. వారి కాళ్లు విరిగేలా కొట్టారని, మొహాలను గోడకేసి బాదారని జననాంగాల్లోకి కట్టెలు, బాటిళ్లను దూర్చి థర్డ్ డిగ్రీతో హింసించారని పోలీసుల అకృత్యాలకు ఇదొక నిదర్శనమని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
 

More Related Stories