నాలుగేళ్ళుగా అత్యాచారం..వెలుగులోకి తెచ్చిన చిన్మయిJustice For Sasikala
2020-07-05 21:40:15

తమిళనాడులో వరుస అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  తాజాగా ఏడేళ్ల బాలిక రేప్ కలకలం రేపగా ఇప్పుడు మరో మహిళను బ్లాక్ మెయిల్ చేసి నాలుగేళ్ళుగా రేప్ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని చెయ్యూరు యూత్ లీడర్ ఒకడు అతడి సోదరుడుతో కలిసి ఓ మహిళపై గత నాలుగేళ్లుగా అత్యాచారం చేశారు. ఆ మహిళ  స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం నాలుగేళ్ళుగా చేయసాగారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె ఎదురుతిరగడంతో చివరికి చంపేశారు. ఈ

విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సింగర్ చిన్మయి జస్టిస్ ఫర్ శశికళ పేరుతో హ్యాష్ ట్యాగ్ పెట్టి ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లింది. ‘22 ఏళ్ల యువతి స్నానం చేస్తుండగా ఇద్దరు వీడియో తీశారు. ఆపై బ్లాక్ మెయిల్ చేస్తూ నాలుగేళ్లుగా అత్యాచారం చేశారు. జూన్ 24న ఉరివేసుకొని ఆమె చనిపోయింది. ఆమె కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. నిందితులు పరారీలో ఉన్నారు’ అని ఆమె పేర్కొంది. వీరు ఇద్దరూ ఓ పార్టీకి చెందిన వారని ఆమె పేర్కొంది. 

More Related Stories