ఓటిటిలో జ్యోతిక అయినా బోణీ కొడుతుందా..?ott
2020-05-24 16:51:54

అదేంటో కానీ ఇప్పటి వరకు థియేటర్స్ కాకుండా ఓటిటిలో విడుదల చేసిన ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు.. మంచి రివ్యూస్ అందుకోలేదు. అమృతరామమ్ సినిమా కూడా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంది. హిందీలో విడుదలైన సినిమాలకు కూడా పెద్దగా టాక్ రాలేదు. దాంతో ఓటిటి కలిసి రావడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. అసలే కరోనా కాటుకు భయపడి ఇప్పట్లో బయటికి వచ్చేలా లేరు ఆడియన్స్. దాంతో పాటు థియేటర్స్ కూడా ఆగస్ట్ వరకు మూసుకునే ఉంటాయని నాయకులు కూడా చెప్తున్నారు. దాంతో ఇప్పుడు క్రేజీ సినిమాలు ఓటిటిలో విడుదలవుతున్నాయి. అలా చేసిన తొలి నటుడు సూర్య. తన భార్య ప్రధాన పాత్రలో నటించిన పొన్‌మగళ్‌ వందాల్‌ చిత్రాన్ని మే 29వ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నాడు సూర్య. థియేటర్స్ సంఘాలు ఎదురించినా.. వివాదాలు రేగినా కూడా ఈయన మాత్రం వెనకడుగు వేయలేదు. పొన్‌మగళ్‌ వందాల్‌ కు ప్రేక్షకుల నుంచి ఏ స్థాయిలో స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఓటిటి కలిసి రావడం లేదు. అయితే ఇప్పుడు విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ రప్ఫాడిస్తుంది. ఇది చూస్తుంటే కచ్చితంగా సినిమాకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో జ్యోతిక న్యాయవాది పాత్రలో నటించింది. మరి చూడాలిక.. జ్యోతిక అయినా ఓటిటిలో బోణీ కొడుతుందో లేదో..?

More Related Stories