ఎస్పీ బాలు హెల్త్  తగ్గాలని కేఏ పాల్ ప్రార్ధనలు KA Paul
2020-08-25 08:09:31

ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఎంజిఎం ఆసుపత్రి తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఆయన ఇంకా ఐసీయూలో వెంటిలేటర్ మీదనే ఉన్నారని, ఎక్నో లైఫ్ సపోర్ట్ తో ఆయనకు చికిత్స కొనసాగుతోందని బులెటిన్ లో పేర్కొన్నారు. నిపుణులైన వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారని ఆసుపత్రి పేర్కొంది.   కోవిడ్ చికిత్సలో నిష్ణాతులైన యుఎస్, యూకే వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఎస్పి బాలు కు వైద్య సేవలు అందిస్తున్నామమని, ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి పేర్కొంది. అయితే ఆయన కరోనా నుంచి కోలుకున్నారని.. కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని వార్తలు రాగా.. అవన్నీ పుకార్లే అని ప్రస్తుతం నాన్న పరిస్థితి సీరియస్‌గా ఉందని బాలు క్షేమ సమాచారాన్ని తెలియజేశారు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్. ఇక ఎస్పీ బాలు ఆరోగ్యం కోసం చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ సువార్తీకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ఎస్పీ బాలు కోసం ఆన్ లైన్ ప్రేయర్స్ నిర్వహిస్తున్నారు. దేవుడ్ని స్తుతిస్తూ.. అనేక మందిని తన పాటల ద్వారా క్రీస్తులోకి నడిపించిన ఎస్పీ బాలు కోలుకోవాలని కేఏ పాల్ ప్రార్ధన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

More Related Stories