పవన్ వకీల్ సాబ్ నుంచి మరో పాట..Kadhulu Kadhulu​
2021-04-07 17:38:50

పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన "వకీల్ సాబ్" సినిమా ఏప్రిల్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగం పెంచిన చిత్ర బృందం  తాజాగా సినిమాలోని మరో పాటని విడుదల చేసింది. ‘కదులు కదులు కదులు.. కట్లు తెంచుకొని కదులు’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోని బుధవారం విడుదల చేశారు. 

ఈ పాటని శ్రీకృష్ణ, హేమచంద్ర ఆలపించారు. ప్రముఖ రచయిత సుద్దాల ఆశోక్‌ తేజా ఈ పాటకి సాహిత్యం సమకూర్చారు. ఈ పాటలో ‘గాజుతో గాయాలు చెయ్.. చున్నీనే ఉరితాడు చెయ్.. రంగులు పెట్టే గోళ్లనే బాకులు చెయ్’ వంటి మాటలు మహిళలను ఎంతో చైతన్యపరుస్తున్నాయి. 

పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నివేదా థామస్, అంజలి, అనన్యలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బోణీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు.

More Related Stories