ఆ బాలీవుడ్ హీరో, దర్శకుడిపై కాజల్ అగర్వాల్ ఫైర్..Kajal agarwal
2019-10-26 13:31:24

కాజ‌ల్.. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో  కూడా బాగా పాపుల‌ర్. అక్క‌డ కూడా వరస సినిమాలు చేసింది కానీ ఎందుకో కానీ సక్సెస్ కాలేదు. ఒకట్రెండు విజయాలు వచ్చినా ఈ భామను పట్టించుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి వచ్చిన కాజల్ అక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ముఖ్యంగా మూడేళ్ల కింద తాను చేసిన దో ల‌ఫ్జోంకీ క‌హానీ సినిమా గురించి నానా రచ్చ చేసింది ఈ భామ. తన జీవితంలో ఆ సినిమా అనవసరంగా చేసానని చెప్పింది. ఇదివరకే ఈ చిత్రం గురించి చాలా కమెంట్స్ చేసింది. ఇప్పుడు మరోసారి ఇదే చేసింది కాజ‌ల్. ఆ సినిమా హీరో రణ్ దీప్ హూడా.. దర్శకుడు దీపక్ టిజోరిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు పెద్ద సినిమా కాదని.. కేవలం కథ నచ్చి చేసాను కానీ ఆ తర్వాత తెలిసింది అది కూడా పెద్ద కథేం కాదని అని చెబుతుంది కాజల్. అసలు ఆ దర్శకుడితో పనిచేయడమే తను చేసిన పెద్ద తప్పు అంటుంది. ఇక రణ్ దీప్ తో పని చేయడం కూడా చాలా ఇబ్బందిగా అనిపించిందని చెబుతుంది కాజల్ అగర్వాల్. ఆ సినిమాలో ర‌ణ్ దీప్ హూడాతో లిప్ లాక్ సీన్స్ తో పాుట బెడ్రూమ్ సీన్స్ కూడా చేసింది కాజల్. ఈ భామ మాత్రం త‌నకిష్టం లేకుండా సీన్ జ‌రిగిందంటోంది. అయితే ఈ విష‌యంపై హీరో ర‌ణ్ దీప్ హూడా స్పందించాడు. స‌న్నివేశంలో ఎమోష‌న్ ను బ‌ట్టి ముద్దు సీన్ అవ‌సరం.. ద‌ర్శ‌కుడు కూడా అదే చెప్పాడు.. దాంతో తాను కూడా కాజ‌ల్ ను ముద్దు పెట్టుకున్నాను.. అయితే కాజ‌ల్ ఈ ముద్దు సీన్ ఎక్స్ పెక్ట్ చేయ‌క‌పోవ‌డంతో కాస్త ఇబ్బందిగా ఫీలైంది.. త‌ర్వాత సీన్ ప్రాముఖ్య‌త చెప్పిన త‌ర్వాత ఒప్పుకుని హాయిగా ముద్దు పెట్టేసింది. ఎమోష‌న్ ను క్యారీ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు ర‌ణ్ దీప్ హూడా. అంటే హీరో చెప్పిన దాన్ని బ‌ట్టి  చూస్తే కాజ‌ల్ ఇష్ట‌ప్ర‌కార‌మే ఆ ముద్దు సీన్ ను చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు. మ‌రి ఇప్పుడు కాజ‌ల్ ఈ ర‌చ్చ చేయ‌డానికి కార‌ణ‌మేంటి..?  కావాల‌నే ఈ విష‌యాన్ని కాంట్ర‌వ‌ర్సీ చేస్తుందా.. ఏమో మూడేళ్ల తర్వాత కూడా ఆ సినిమా గురించి కాజల్ మనసులో పెట్టుకుని మాట్లాడేసింది.

More Related Stories