సుబ్బ‌రాజు తో కాజ‌ల్ అగ‌ర్వాల్kajal
2021-06-21 12:26:16

కరోనా పరిస్థితుల కారణంగా థియేటర్ లు మూతపడిన సంగతి తెలిసిందే. దాంతో కాలక్షేపం కోసం సినిమాలు చూసే ఛాన్స్ లేకుండా  పోయింది. ఈ పరిస్థితుల్లో సినిమా ప్రేమికులకు ఓటీటీ లే పెద్దదిక్కుగా మారాయి. ఓటీటీ యాజమాన్యాలు కూడా స్టార్ హీరోయిన్లను పెట్టి వెబ్ సిరీస్ లు తీయడానికి ఇష్టపడుతున్నారు. తమన్నా ఇప్పటికే 11th అవర్, నవంబర్ స్టోరీస్ అనే రెండు వెబ్ సిరీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు . సమంత కూడా తన స్టార్ హీరోయిన్ స్టేటస్ ని పక్కన పెట్టి ఫ్యామిలి మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించడం జరిగింది. ఈ మధ్యనే విడుదలైన ఈ వెబ్ సిరీస్ ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ కూడా హాట్ స్టార్ లో ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో సుబ్బరాజు కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్ ఇదివరకే హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించడం జరిగింది. హార్రర్ స్టోరీగా తెరకెక్కిన ఈ వెబ్ సైట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు కాజల్ ఎలాంటి పాత్రలో నటిస్తుందో చూడాలి.
 

More Related Stories