కాజల్ మాస్టర్ ప్లాన్.. అన్నాదమ్ములతో ఒకేసారి..chiru
2020-04-15 14:53:41

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 13 ఏళ్లైపోయింది.. ఇప్ప‌టికీ హీరోయిన్ గానే కొన‌సాగుతుంది కాజ‌ల్. ఆల్ మోస్ట్ కెరీర్ కు శుభం కార్డ్ ప‌డుతుంద‌నే టైమ్ లో మ‌ళ్లీ 2017 ఆమెకు కొత్త లైఫ్ ఇచ్చింది. ఆ ఏడాది ఖైదీ నెం.150 సినిమాలో చిరంజీవి నుంచి ఆఫ‌ర్ రావ‌డంతో కాజ‌ల్ కెరీర్ మ‌ళ్లీ ఊపందుకుంది. ఈ చిత్రం సూప‌ర్ హిట్ అయిన త‌ర్వాత‌.. వెంట‌నే నేనేరాజు నేనేమంత్రితో మ‌రో హిట్ కొట్టింది చంద‌మామ‌. త‌మిళ‌నాట కూడా ఇప్పుడు కాజ‌ల్ ర‌ప్ఫాడించేస్తుంది. ఈ ఏడాది అక్క‌డ వివేగంతో ఫ్లాప్ అందుకున్నా.. మెర్స‌ల్ తో రికార్డ్ సినిమాలో భాగం అయింది. ఇప్పుడు కూడా త‌మిళ‌నాట క్వీన్ సినిమా రీమేక్ లో న‌టిస్తుంది కాజ‌ల్. ఈ చిత్రాన్ని ర‌మేష్ అర‌వింద్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇవ‌న్నీ ఉండ‌గానే తెలుగులో కూడా వరస సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది ఈమె. ఏం మాయ చేస్తుందో తెలియదు కానీ ఇప్పటికీ చందమామకు క్రేజ్ అయితే తగ్గట్లేదు.. అవకాశాలు కూడా వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి. దానికితోడు 2 కోట్లకు పైగానే పారితోషికం కూడా అందుకుంటుంది.

ముఖ్యంగా సీనియర్ హీరోలతో నటించడానికి ఏ మాత్రం మొహమాటం లేకుండా భారీ పారితోషికం డిమాండ్ చేస్తుంది చందమామ. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఆమెతో నటించడానికి స్టార్ హీరోలు ఇప్పటికీ వేచి చూస్తున్నారు.. ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇదే జరుగుతుంది. తాజాగా మరో ఇద్దరు సూపర్ స్టార్స్ తో నటించబోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా చేస్తున్న కాజల్.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా ఇలా ఉండగానే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాలో కూడా కాజల్ హీరోయిన్ అని ప్రచారం జరుగుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలు కానుంది. గతంలో ఓ సారి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ తో రొమాన్స్ చేసింది ఈమె. ఇప్పుడు మరోసారి పవన్ సరసన నటించడానికి రెడీ అవుతుంది కాజల్. ఈ సినిమా కోసం రెండున్నర కోట్లకు పైగా అడుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా పవన్ సినిమా కూడా ఓకే అయితే.. ఒకేసారి మెగాస్టార్, పవర్ స్టార్ తో నటించిన ఒకే ఒక్క హీరోయిన్ గా చరిత్రలో నిలిచిపోతుంది కాజల్ అగర్వాల్. చూడాలిక.. ఏం జరుగుతుందో..?

More Related Stories