ఈరోజే చందమామ పెళ్లి..టైం ఇదేKajal Aggarwal
2020-10-30 10:16:58

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన ప్రియుడిని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాజల్ ఎంతో కాలం పాటు ప్రేమించిన తన ప్రియుడిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోనుంది. ఇప్పటికే వారి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఎంగేజ్మెంట్ సందర్భంగా కాజల్ తమ ప్రియుడితో ఉన్న ఫోటోలను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ వెంటనే కాజల్ తన పెళ్లి తేదీ అక్టోబర్ 30 అని ప్రకటించింది. ఇక కాజల్ ప్రకటించినట్టుగా ఈరోజు సాయంత్రం 5గంటలకు పెళ్లి పీటలు ఎక్కనుంది ముంబై లోని స్టార్ హోటల్ లో కాజల్ వివాహం జరగనుంది. ఇక కరోనా నేపథ్యంలో ఈ బ్యూటీ వివాహం అతికొద్ది మంది అతిథుల సమక్షంలోనే జరగనుంది. ఈరోజే మేహేంది ఫంక్షన్ కూడా జరగనున్నట్టు సమాచారం. కుటుంబసభ్యులు మరియు కొంతమంది సన్నిహితులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కాజల్ తెలుగులో చందమామ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో కాజల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో రాజమౌళి కంట పడటంతో కాజల్ రేంజ్ మారిపోయింది. ఒక్క మగధీర సినిమాతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ల లిస్టులో కాజల్ చేరిపోయింది. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి తో సైతం సినిమాలో నటించే అవకాశం కాజల్ కు దక్కడం అదృష్టమనే చెప్పాలి. ఇక పెళ్లి తరవాత కూడా కాజల్ సినిమాలను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More Related Stories