కాజల్ నిర్మాతగా డ్రాప్ అయిందాkajal
2019-10-31 05:04:34

ఆమధ్య ఆ సినిమాని తెరకెక్కించి ప్రశంసలు పొందిన ప్రశాంత్ వర్మ తరవాత రాజశేఖర్ హీరోగా కల్కి సినిమా తెరకెక్కించాడు. అయితే దర్శకత్వంలో కథానాయిక కాజల్ అగర్వాల్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. KA వెంచర్ పేరుతో ఓ ప్రొడ‌క్షన్ హౌజ్ కాజ‌ల్ పేరుతో మొదలు పెడుతుందని అందులోనే ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరిగింది. తన సొంత బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిర్మించే సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రం ప్రయోగాత్మక చిత్రంగా ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే, తాజాగా కాజల్ ఈ చిత్రనిర్మాణాన్ని విరమించుకున్నట్టు సమాచారం. స్క్రిప్టు సిద్ధమయ్యాక ఆ చిత్రం వర్కౌట్ కాదని లెక్కలు వేసుకోవడంతో ఆ ప్రాజక్టు మొత్తాన్ని డ్రాప్ చేసుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం కాజల్ క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2లో న‌టిస్తూ బిజీగా ఉంది కాజ‌ల్. ప్రశాంత్ వర్మ కూడా ఈ ప్రాజెక్ట్ అయిపోవడంతో త‌దుప‌రి సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడట.

More Related Stories