కాజల్ ని చిన్ననాటి రోజులకి తీసుకెళ్ళిన కరోనాkajal
2020-03-29 17:27:05

కరోనా..! ఈ పేరు వింటనే ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. అంటార్కిటాకా తప్ప అన్ని ఖండాలను ఆక్రమించింది ఈ కరోనా. ఖండాలను ఆక్రమిస్తూ మానవాళి మీద విరుచుకుపడుతూ తన విశ్వరూపాన్ని చూపుతోంది. ఇప్పటి వరకూ కరోనా వైరస్ బారిన పడి 26 వేల మందికి పైగా  ప్రాణాలు కోల్పోగా.. 5 లక్షల 85 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 300 కోట్ల మంది ప్రజలు లాక్‌డౌన్‌లో ఉన్నారు. ఇక మన టాలీవుడ్ పరిస్థితి కూడా అంతే దాదాపుగా అంతా లాక్ డౌన్ అయిపొయింది. కరోనా కారణంగా షూటింగ్స్ లేక ఇంటికే పరిమితమయ్యారు మన సినీతారలంతా. ఇప్పుడీ అనుకోని బ్రేక్ ని ఒక్కొక్క స్టార్ ఒక్కో తరహాలో వాడుకుంటున్నారు. ఇప్పుడు కాజల్ తన చిన్నప్పటి సీరియల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తోందట. కరోనా వైరస్ కారణంగా ఇళ్ళకే పరిమితం అయిన ప్రజల కోసం ప్రభుత్వం “రామాయణ్”, ” మహాభారత్” సీరియల్స్ పున ప్రసారం చేస్తోంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ దూర దర్శన్ లో ప్రసారమయ్యే “రామాయణ్”, ” మహాభారత్” సీరియల్స్ ను చిన్న వయసులో కుటుంబ సభ్యులతో చూసి ఎంజాయ్ చేసేదానినని, ఆ రెండు సీరియల్స్ పున ప్రసారం కావడం సంతోషంగా ఉందని, ఇటువంటి పురాణ కథలతో పిల్లలు ఎంతో నేర్చుకోవచ్చని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ భామ విష్ణు మోసగాళ్లు, కమల్ హాసన్ భారతీయుడు2, చిరంజీవి సరసన ‘ఆచార్య’ చిత్రంలో నటించబోతుంది. 

More Related Stories