క్యాస్టింగ్ కౌచ్ పై మళ్లీ రచ్చ.. ఇక్కడ అన్నీ ఉన్నాయంటున్న కాజల్..Kajal Aggarwal
2019-10-26 13:59:44

ఈ మధ్య కాలంలో ప్రతి హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతుంది. తమకు జరిగిన అనుభవాల గురించి మీడియా ముందుకు వచ్చి పంచుకుంటున్నారు ముద్దుగుమ్మలు. కొందరికి చేదు అనుభవాలు ఉంటే మరికొందరికి అలాంటి అనుభవాలు ఏమీ లేవని చెబుతున్నారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ వుందని కుండ బద్దలు కొట్టేసింది కాజల్. ఈ భామ తన మాటలతో సంచలనం రేపుతుంది. అవకాశాల కోసం హీరోయిన్లను పడకగదికి పిలిచే దర్శక నిర్మాతలు ఇంకా మన ఇండస్ట్రీలో ఉన్నారని సంచలన విషయాలు బయట పెట్టింది చందమామ. అయితే తన విషయంలో మాత్రమే దర్శకుడు కానీ.. నిర్మాత గానీ ఎప్పుడూ అలా ప్రవర్తించలేదని.. అలా అసభ్యంగా ప్రవర్తిస్తే తాను అపర కాళికలా మారిపోతానంటుంది చందమామ. ఇప్పటివరకు తనకు క్యాస్టింగ్ కౌచ్ ఎలా ఉంటుందో తెలియదని.. ఇలాంటి చేదు అనుభవాలు తన కెరీర్లో ఎదురు కాలేదని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. పదకొండేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఎప్పుడూ అవకాశాల కోసం ఎదురు చూడలేదని.. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయని చెప్తుంది కాజల్. తనతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కాలర్ పట్టుకొని నిలదీసే ధైర్యం తనకు ఉందంటుంది కాజల్ అగర్వాల్. తన స్నేహితురాలు విషయంలో అసభ్యంగా ప్రవర్తించిన ఒక వ్యక్తిని ఇలాగే నడిరోడ్డుపై కాలర్ పట్టుకుని నిలదీసానని చెప్పింది చందమామ. మొత్తానికి కాజల్ మాటలతో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బలంగా ఉందని అర్థమైపోతుంది.

More Related Stories