మహేష్ బాబు, ప్రభాస్ తర్వాత ఆ అదృష్టం కాజల్ కే..kajal
2019-12-18 05:22:48

తెలుగు ఇండస్ట్రీ కి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. కొందరు హీరోయిన్లు మాత్రమే ఏళ్ళ తరబడి ఇక్కడ తమ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఉంటుంది. ఎప్పుడో 12 ఏళ్ల కింద లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమా డిజాస్టర్ అయినా కూడా చందమామ సినిమాతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా కూడా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది కాజల్. ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన కాజల్ ఇప్పుడు మరో గౌరవాన్ని అందుకుంది. అసలు విషయం ఏంటంటే సింగపూర్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ప్రదర్శించనున్నారు. దీనికోసం ఇప్పటికే ఆమె కొలతలు కూడా తీసుకున్నారు నిర్వాహకులు.

అక్కడ సెలబ్రిటీల మైనపు బొమ్మలను ఏర్పాటు చేయడం ప్రత్యేకత. కేవలం ప్రాణం మాత్రమే లేకపోయినా కూడా అచ్చంగా మనుషుల మాదిరే ఉంటాయి ఆ మైనపు విగ్రహాలు. ఇప్పటికే ఎంతోమంది భారతీయ సెలబ్రిటీల విగ్రహాలు అక్కడ ప్రదర్శించారు. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, ప్రభాస్ మైనపు బొమ్మలను తయారు చేసిన మేడమ్ టుస్సాడ్స్ ఇప్పుడు కాజల్ అగర్వాల్ బొమ్మను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం ఇప్పటికే కాజల్ కొలతలు కూడా తీసుకోవడంతో ఆమె ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా కూడా తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు ప్రభాస్ తర్వాత ఆ అరుదైన గౌరవాన్ని అందుకుంది కాజల్ అగర్వాల్ మాత్రమే

More Related Stories