టీనేజర్ గా మారనున్న కాజల్ Kajal Aggarwal
2019-08-29 15:20:21

తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో కూడా తన అదృష్టం పరీక్షించుకుంది. అయితే అడపా దడపా సినిమాలు చేసినా అమెకి విజయం కాదు కదా గుర్తింపు కూడా లభించలేదు. అయినా వెనకడుగు వేయని ఆమె మరో ప్రయత్నం చేయడానికి సిద్దమయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె తాజాగా మరో బాలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ముంబై గ్యాంగ్‌ వార్స్ నేపథ్యంలో సాగే 'ముంబాయి సాగా' అనే సినిమాలో జాన్‌ అబ్రహం సరసన కాజల్‌ నటించడానికి ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. సునీల్‌ శెట్టి, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి సంజయ్ గుప్తా దర్శకత్వం వహించబోతున్నారని అంటున్నారు. 

అయితే ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో కాజల్ ఒక టీనేజర్ పాత్ర పోషించబోతోంది. ఆమె పాత్ర జాన్‌ అబ్రహామ్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా 17 ఏళ్ల కాలేజీ అమ్మాయిగా ఉన్నప్పుడు మొదలవుతుంది. ఆమే ఆ తర్వాత అతని భార్యగా మారుతుంది. 'ముంబై సాగా' 80, 90ల నేపథ్యంలో సాగే కథఅని చెబుతున్నారు. ఈ సినిమా మొన్న మంగళవారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ కి కూడా వెళ్లిందట. ఇక మరోపక్క కాజల్‌ సూర్య సరసన మరోసారి నటించనుంది. సూర్యతో గతంలో 'బ్రదర్స్‌' సినిమాలో నటించింది. 2012లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నా పెద్దగా కలెక్షన్స్ మాత్రం రాలేదు. డైరెక్టర్ శివ దర్శకత్వం వహించే ఈ సినిమాలోనూ కాజల్‌ పాత్ర చాలా పవర్ఫుల్‌ గా ఉంటుందని అంటున్నారు.  

More Related Stories