కాజల్ అగర్వాల్ కోపాన్ని చూసారా.. సెన్సార్ బోర్డ్ తీరుపై అసహనం.. Kajal Aggarwal
2020-02-24 12:26:59

అవును.. నిజంగానే ఇప్పుడు కాజల్ కు కోపం వచ్చింది. అంతా ఇంతా కాదు ఏకంగా సెన్సార్ బోర్డుపైనే అరిచేంత. కష్టపడి చేసిన సినిమాను కట్ చేస్తే ఎవరికి మాత్రం కోపం రాదు చెప్పండి..? ఇప్పుడు కాజల్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈమె నటించిన క్వీన్ సినిమా రీమేక్ పారిస్ పారిస్ విషయంలో వచ్చింది అసలు రచ్చంతా. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది. 

తాజాగా సెన్సార్ కు వెళ్తే అక్కడ ఈ సినిమాకు చుక్కలు చూపించారు సెన్సార్ బోర్డ్. ఒకటి రెండు కాదు ఏకంగా 25 కట్లు వేయడంతో కాజల్ కు షాక్ తప్పలేదు. క్వీన్ రీమేక్ ను రమేష్ అరవింద్ తెరకెక్కించాడు. సెన్సార్ బోర్డ్ ఇచ్చిన షాక్ తో ఇప్పుడు ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నారు మేకర్స్. మరోవైపు కాజల్ మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లుగా ఉంది. ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తనకు తెలియదు అని చెబుతుంది. 

అయితే సెన్సార్ ఇష్యూపై మాట్లాడుతూ అసలు ఎందుకు అంతగా సీన్స్ కట్ చేసారో తెలియదు అంటుంది. టీజర్ లో కాజల్ స్థనాల్ని నొక్కే సీన్స్ ఉన్నాయి. అలాంటి హాట్ సీన్స్ సినిమాలో ఇంకా ఉండటంతో కత్తెరకు పని చెప్పింది సెన్సార్ బోర్డ్. అయితే ఈ విషయంపై కాజల్ వర్షన్ మరోలా ఉంది. తాము హిందీలో ఎలా ఉంటే ఇక్కడ అదే చేసామని.. అక్కడ సెన్సార్ వదిలేసినపుడు ఇక్కడెందుకు వదిలేయదు.. అంటూ రెచ్చిపోతుంది. అక్కడా ఇక్కడా కొన్ని బౌండరీస్ ఉంటాయనే విషయాన్ని గ్రహించలేకపోతుంది కాజల్ అగర్వాల్. 

సెన్సార్ చిక్కులు ఉండటంతో ఈ చిత్రం ఎప్పటికి బయటికి వస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదే సినిమాను తెలుగులో తమన్నా దట్ ఈజ్ మహాలక్ష్మీగా.. మళయాలంలో జంజంగా.. కన్నడలో బటర్ ఫ్లైగా తెరకెక్కించారు. అన్ని చోట్లా ఈ సినిమా విడుదలకు అడ్డంకులు వస్తున్నాయి.

More Related Stories