విరాళం ఇచ్చినా పాపం కాజల్ ని ఆడుకుంటున్నారు kajal
2020-04-17 19:58:14

కరోనా వైరస్ కారణంగా దేశంలోని అన్ని పరిశ్రమలు షట్ డౌన్ అయిపోయాయి. ఎమర్జన్సీ సేవలు తప్ప మిగతా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా పని లేకపోతే రోజు గడవని వారి కోసం అండగా నిలుతున్నాయి. ఇక సినీపరిశ్రమ పై ఆధారపడిన పేద సినీ కార్మికుల సంక్షేమానికై చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ సంస్థ ఏర్పాటయింది. సుమారు 12000 వేల మంది కార్మికులకు ఈ సంస్థ నిత్యావసర వస్తువులు అందజేస్తు వస్తోంది. ఇక ప్రభుత్వాలకి విరాళం ఇచ్చినా చాలా మంది సినీ ప్రముఖులు తమ సినిమా వారి కోసం తమ వంతు సాయంగా కరోనా క్రైసిస్ ఛారిటీకి కూడా విరాళాలు అందించారు.

తాజాగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ నిన్న 2లక్షలు విరాళం అందజేశారు. ఆర్టీజీఎస్ ద్వారా సీసీసీకి డబ్బు అందించినట్టు కాజల్ మేనేజర్ మీడియాకి తెలిపారు. అయితే ఆమె విరాళం ఇచ్చినా ఆమె మీద నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సౌత్‌ లో స్టార్ కథానాయికగా కొనసాగుతూ సినిమాకు కోటి వరకు పారితోషికం తీసుకునే కాజల్ కేవలం రెండు లక్షలు ఇవ్వడమేంటి అని ఆమె మీద విమర్శలు వస్తున్నాయి. తక్కువ రెమ్యునరేషన్ తీసికునే వల్లే ఎక్కువ విరాళం ఇస్తోంటే కోట్లకి కోట్లు దండుకుంటే కాజల్ కి వచ్చిన నొప్పి ఏమిటని ప్రస్నిస్తున్న్నారు.  

More Related Stories