అల్లు అర్జున్ పాటతో వచ్చేస్తున్న మెగాస్టార్ చిన్నల్లుడు..Kalyaan Dhev
2019-10-26 13:41:48

విజేత సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఇప్పుడు రెండో సినిమాకు సిద్ధమవుతున్నాడు. తొలి సినిమా డిజాస్టర్ కావడంతో ఎలాగైనా రెండో సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈయన రెండో సినిమా టైటిల్ ఇఫ్పుడు విడుదలైంది. దివాళి సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ మెగా ఫ్యాన్స్ కు బాగా నచ్చేస్తుంది. అల్లు అర్జున్ ఆల్ టైమ్ క్లాసిక్ మాస్ సాంగ్ సూపర్ మచ్చి అనే పదాన్నే తన సినిమాకు టైటిల్ గా పెట్టేసుకున్నాడు ఈయన. ఈ సినిమాను కొత్త దర్శకుడు పులి వాసు తెరకెక్కిస్తున్నాడు. 1980ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని పులి వాసు తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తుండగా.. యంగ్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ దేవ్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మొత్తానికి కచ్చితంగా ఈ చిత్రంతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈయన. మరి అల్లుడి ఆశలను సూపర్ మచ్చి నెరవేరుస్తుందో లేదో చూడాలిక.
 

More Related Stories