కళ్యాణ్ రామ్ తో వీఐ ఆనంద్...ఫిక్స్ అయినట్టే Kalyan Ram
2020-06-28 20:57:37

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హిట్ అనే మాట విని చాలా కాలమైంది. పటాస్ సినిమా చేసిన తర్వాత ఆయన చేసిన అన్ని సినిమాలు నిరాశ పరుస్తూనే ఉన్నా పట్టువదలని విక్రమార్కుడి లాగా ఆయన సక్సెస్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాడు. కానీ ఆయనకు వర్కౌట్ కాలేదు. ఇక ఆయన చేసిన ఎంత మంచి వాడవురా కి మంచి పేరు సంగతి అటు ఉంచితే తలనొప్పి సినిమా అని ముద్ర వేసేశారు కొంత మంది. అయితే ఆయన ప్రస్తుతం మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది దాదాపు పూర్తి కావొచ్చింది, అయితే ఆయన వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. మొన్నీ మధ్య ఆయన రవితేజతో డిస్కో రాజా సినిమా చేశారు. అది కూడా వర్కౌట్ కాలేదు, దీంతో ఆయన ఈసారి మరింత శ్రద్ధ పెట్టి కధ రెడీ చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే స్క్రిప్టు పూర్తయిందని ఈ పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే సినిమాని పట్టాలెక్కిస్తారని అంటున్నారు. ఈ సినిమాని ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ మీద మహేష్‌ ఎస్‌ కోనేరు నిర్మిస్తారని అంటున్నారు.  

More Related Stories