పుష్పక విమానం.. కళ్యాణం లిరికల్ సాంగ్ రివ్యూ



Kalyanam Lyrical Song
2021-06-18 16:47:46

ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "పుష్పక విమానం". గీత్ సైని నాయికగా నటిస్తోంది. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. 'కింగ్ అఫ్ ది హిల్' ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

'కళ్యాణం..' లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు సమంత. సినిమాలో కళ్యాణం పాట హీరో హీరోయిన్ల పెళ్లి సందర్భంలో వస్తుంది. సుందర్, మీనాక్షి పెళ్లి వేడుక చూసేందుకు అతిథులంతా ఆనందంగా ఎదురుచూస్తుంటారు. వాళ్ల పెళ్లి కార్యక్రమాలు మంగళ స్నానాలతో మొదలవుతాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అందంగా ముస్తాభయి మండపంలోకి వస్తారు. ఇద్దరి మొహాల్లో తెలియని బిడియం, సిగ్గు ఉట్టిపడుతుండగా..అమ్మలాలో పైడి కొమ్మలాలో... ముద్దుల గుమ్మలాలో సందళ్లు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో.. మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో...అంటూ కళ్యాణం పాట ప్రారంభమవుతుంది. 

కళ్యాణం కమనీయం, ఒకటయ్యే వేళనా వైభోగం, కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం..అంటూ సాగుతుంది. చరణంలో పెళ్లిని అంకెలతో పోల్చూతూ అద్భుతంగా రాశారు గీత రచయిత కాసర్ల శ్యాం. ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మలా బంధంగా...ఎనిమిది గడపదాటి ఆనందాలు చూడగా..మీ అనుబంధమే బలపడగా..ఇక తొమ్మిది నిండితే నెల..నెమ్మ నెమ్మదిగా తీరెే కల..పది అంకెల్లో సంసారమిలా, పదిలంగా సాగేటి అల.. అని సాగే చరణంలో ఆదర్శ వైవాహిక జీవితాన్ని చూపించారు.

ఇక ఈ పాటను మంగ్లీ, సిధ్ శ్రీరామ్ మళ్లీ మళ్లీ వినేలా పాడారు. తన మ్యూజిక్ టాలెంట్ తో కళ్యాణం పాటను మరో హిట్ నెంబర్ చేశారు సంగీత దర్శకుడు రామ్ మిరియాల. ఈ పాటకు అకేషన్ కు తగినట్లు సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ చేశారు రఘు మాస్టర్. అలాగే నీల్ సెబాస్టియన్ వేసిన పెళ్లి మండపం సెట్ ఎంతో అందంగా ఉండి ఆకట్టుకుంటోంది.

More Related Stories